అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police Suspended | ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District)లో ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. సీఐ, ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని తనకల్లు ఎస్సై గోపీ (SI Gopi), హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన ఆయన ఆరోపణలు నిజమని తేలడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు. అలాగే అవినీతికి పాల్పడుతున్నారని పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు (CI Sivanjaneyulu)పై సైతం వేటు వేశారు.
Police Suspended | పోలీసుల ముందే హత్య
తనకల్లు పోలీస్ స్టేషన్ (Tanakallu Police Station) ఎదుట ఈ నెల 5న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈశ్వరప్ప అనే వ్యక్తిపై హరి, చెన్నప్ప దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. అయితే పోలీసుల ముందే హత్య జరిగినా.. పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన ఎస్పీ ఎస్సై గోపీతో పాటు హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసుల ముందే హత్య జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.