అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు.
Nizamabad City | పూసలగల్లీలో చోరీ..
నగరంలోని (Nizamabad City) పూసలగల్లీలో ఓ ఇంట్లో చోరీ జరగగా.. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సీసీ పుటేజీ, సాంకేతిక, ఫింగర్ ప్రింట్స్ (Finger prints) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇంటెలిజెన్స్ సమాచారంతో ముగ్గురు నిందితులు సతీష్నగర్కు చెందిన షేక్ సాదిక్, గాజుల్‌పేట్‌కు (Gajulpet) చెందిన మరాటి మాధవ్, వెంగల్రావ్ నగర్ కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.