అక్షరటుడే, వెబ్డెస్క్ : Cold Wave | రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department officials) హెచ్చరించారు. డిసెంబర్ 7 నుంచి 16 వరకు శీతల గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
రానున్న ఏడు రోజులు రాష్ట్రంలో చలి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 –9 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందన్నారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 13–15 డిగ్రీలు, మిగతా జిల్లాల్లో 9–12 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.
ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13 వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ కాస్తుంది, సాధారణ ఉష్ణోగ్రతలు (temperatures) నమోదు అవుతాయి. ఉదయం, సాయంత్రం సమయంలో చలి అధికంగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.