అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RO-KO | న్యూజిలాండ్‌తో (New Zealand) జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఇవాళతో (జనవరి 18) ముగింపు దశకు చేరుకుంది. ఈ సిరీస్‌లో భారత సీనియర్ స్టార్‌లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ మరోసారి తమ క్లాస్‌ను నిరూపించారు.
అనుభవంతో కూడిన బ్యాటింగ్, కీలక సమయంలో పరుగులు సాధిస్తూ ఇద్దరూ అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. అయితే, ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ –న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ (Rohith Sharma), కోహ్లీలు కనిపించరు. దీంతో వారిద్దరు కొంతకాలం పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉండబోతున్నారు.
RO-KO | టీ20ల్లో యువకులదే బాధ్యత
వన్డే సిరీస్ అనంతరం జనవరి 21 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. కారణం ఈ ఇద్దరూ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దాంతో కివీస్‌తో జరిగే ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో యువ ఆటగాళ్లే జట్టును ముందుండి నడిపించనున్నారు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీలు టెస్టులు, వన్డేలకే పరిమితమయ్యారు. అయితే బీసీసీఐ రూపొందించిన 2026 షెడ్యూల్ ప్రకారం.. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత భారత జట్టుకు వెంటనే మరో వన్డే సిరీస్ లేదు. తదుపరి వన్డే అసైన్‌మెంట్ జూన్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ పర్యటనతో ప్రారంభం కానుంది. అంటే దాదాపు ఐదు నుంచి ఆరు నెలల పాటు ఈ ఇద్దరు సీనియర్లు వన్డేల్లోనూ కనిపించకపోవచ్చు.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (ICC T20 World Cup 2026) జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతున్నప్పటికీ, టీ20లకు వీరిద్దరూ రిటైర్ Retire కావడంతో ఆ మెగా టోర్నీలో రోహిత్–కోహ్లీ జంట కనిపించదు. ఇది అభిమానులకు కొంత నిరాశ కలిగించే అంశమే. అయితే ఇప్పుడు వారి లక్ష్యం మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ వ్యూహం ప్రకారం రోహిత్, కోహ్లీ అనుభవాన్ని ఆ మెగా ఈవెంట్‌కు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో వారి పనిభారాన్ని తగ్గిస్తున్నారు. అందుకే పరిమిత సిరీస్‌లలో మాత్రమే వారిని ఆడించాలని బోర్డు భావిస్తోంది.