అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీఆర్ఎస్ (BRS)నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. దీనిపై గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. దీనిపై గతంలో విచాణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అయినా స్పీకర్ ఇప్పటి వరకు ఏడుగురి అనర్హత పిటిషన్లపై మాత్రమే తీర్పు చెప్పారు.
Supreme Court | వారికి క్లీన్చిట్
సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారించింది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు చెప్పారు. ఆ ఏడుగురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లు కొట్టేశారు. అయితే మరో ముగ్గురిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), కాలే యాదయ్యకు గురువారం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్లోనే ఉన్నట్లు తెలిపారు.
Supreme Court | కీలక పరిణామాలు ఉంటాయి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender), స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) పిటిషన్లపై స్పీకర్ ఇంతవరకు విచారణ జరపలేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై విచారణ పూర్తయిన ఇంకా స్పీకర్ తీర్పు ప్రకటించలేదు. వీరి అనర్హత పిటిషన్లపై సైతం నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని వ్యాఖ్యలు చేసింది. నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.