Tata Group Rallies | ఇది టాటా’స్‌ ‘షేర్‌’.. నష్టాల మార్కెట్‌లోనూ లాభాల ‘ర్యాలీ’స్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata Group Rallies | అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్‌ టారిఫ్‌ల(Trump Tariffs)తో స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. టాటా గ్రూప్‌(Tata Group)లోని చాలా కంపెనీలు ఒత్తిడికి గురవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రూప్‌నకు చెందిన ర్యాలీస్‌(Rallis) కంపెనీ షేరు ధర ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 60 శాతానికిపైగా పెరిగింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) ఏడాది కాలంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు భారీ లాభాలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata Group Rallies | అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్‌ టారిఫ్‌ల(Trump Tariffs)తో స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. టాటా గ్రూప్‌(Tata Group)లోని చాలా కంపెనీలు ఒత్తిడికి గురవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రూప్‌నకు చెందిన ర్యాలీస్‌(Rallis) కంపెనీ షేరు ధర ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 60 శాతానికిపైగా పెరిగింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) ఏడాది కాలంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు భారీ లాభాలు అందించిన బ్లూచిప్‌ కంపెనీ కూడా ఇన్వెస్టర్ల ఓపికను పరీక్షిస్తున్నాయి. ఎక్కువ కంపెనీలు నష్టాలనే మిగిల్చాయి. నమ్మకానికి బ్రాండ్‌గా నిలిచే టాటా గ్రూప్‌లోని అత్యధిక కంపెనీలూ నెగెటివ్‌ రిటర్న్స్‌(Nagative Returns) ఇచ్చాయి. అయితే దీనికి ర్యాలీస్‌ కంపెనీ మినహాయింపు. 2025 క్యాలెండర్‌ ఇయర్‌లో ఓ మోస్తరు రిటర్న్స్‌ అందించింది. డిసెంబర్‌ 31న షేరు ధర రూ. 296 ఉండగా.. ప్రస్తుతం రూ. 355 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంటే 2025 లో దాదాపు 20 శాతం లాభాలను ఇచ్చింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం(Financial Year)లో మాత్రం గణనీయమైన లాభాలను అందించింది. ఏప్రిల్‌లో రూ. 221 ఉన్న షేరు ధర సెప్టెంబర్‌ ఒకటో తేదీ నాటికి రూ. 355కు చేరడం గమనార్హం. అంటే షేరు ధర 60 శాతానికిపైగా పెరిగిందన్న మాట.

కంపెనీ వివరాలు : టాటా గ్రూప్‌నకు చెందిన ర్యాలీస్‌ ఇండియా కంపెనీని 1948లో స్థాపించారు. ఇది టాటా కెమికల్స్‌(Tata Chemicals) అనుబంధ సంస్థ. దేశంలోని ప్రధాన వ్యవసాయ ఇన్‌పుట్‌లను అందించే కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. విత్తనాలు, క్రిమి సంహారకాలు, వ్యవసాయ సంబంధిత రసాయనాలను తయారు చేస్తుంది. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందిస్తోంది. ఈ కంపెనీ విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌ సామర్థ్యం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 2,300లకుపైగా పంపిణీదారుల ద్వారా 40 వేలకంటే ఎక్కువ రిటైల్‌ కౌంటర్లను నిర్వహిస్తోంది.

భారీ ఒడిదుడుకులు : టాటా ర్యాలీస్‌ కంపెనీ స్టాక్‌ ప్రైస్‌ భారీ ఒడిదుడుకుల(Volatility) మధ్య సాగుతుంటుంది. గతేడాది అక్టోబర్‌ మధ్య కాలంనుంచి పడిపోతూ వచ్చిన స్టాక్‌.. ఈ ఏడాది మార్చి నుంచి తేరుకుని మళ్లీ భారీ ర్యాలీ తీసింది. 52 వారాల కనిష్ట ధర రూ. 196 కాగా.. 52 వారాల గరిష్ట ధర రూ. 385.90. ఐదు నెలల కాలంలో దాదాపు 80 శాతానికిపైగా పెరిగిన ఈ స్టాక్‌ 12 నెలల కాలంలో మాత్రం ఎలాంటి రిటర్న్స్‌ ఇవ్వలేదు. 2023 సంవత్సరంలోనూ పడిపోయి లేచింది. ఇన్వెస్టర్లు కంపెనీ పనితీరును పరిశీలిస్తూ కనిష్టాలవద్ద స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయనడానికి ఈ కంపెనీ ఉదాహరణగా నిలుస్తోంది.

 

 

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...