అక్షరటుడే, మెండోరా: Mendora | మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు (Sarpanch elections) సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని ఎంపీడీవో కొండా లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 3 నుంచి ఐదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.
అలాగే 6వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తిరస్కరించబడిన నామినేషన్లపై ఆర్మూర్ సబ్ కలెక్టర్‌కు (Armoor Sub-Collector) అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉందని వివరించారు. విత్‌డ్రా అనంతరం ఫైనల్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
Mendora | డిసెంబర్ 17న పోలింగ్..
డిసెంబర్ 17న స్థానిక సంస్థలకు సంబంధించి పోలింగ్ ఉంటుందని ఎంపీడీవో వివరించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్వో పర్యవేక్షణలో కౌంటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన వార్డు సభ్యుల ఓట్లతో ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారని పేర్కొన్నారు.
Mendora | నామినేషన్ సెంటర్లు..
మెండోరా బుస్సాపూర్ గ్రామ పంచాయతీలో (Bussapur Gram Panchayat) నామినేషన్లు వేయవచ్చు. రిటైనింగ్ ఆఫీసర్‌గా రాజేష్ వ్యవహరించారు. సావెల్, వెల్గటూర్, నడిమితండా గ్రామ పంచాయతీలో రిటర్నింగ్ ఆఫీసర్ దేవన్న ఉంటారు. అలాగే దూదిగాం, జాకిర్యాల్, కోడిచెర్ల గ్రామ పంచాయతీలకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా ధర్మేంద్ర బాధ్యతల్లో ఉన్నారు. పోచంపాడ్, నెహ్రూనగర్, సోంపేట గ్రామ పంచాయతీలకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా పి.మమత వ్యవహరించనున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.
