అక్షరటుడే, ఆర్మూర్ : Nandipet | అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నందిపేట్ మండల కేంద్రంలోని మూడు ప్రముఖ ఆలయాల్లోకి చొరబడి హుండీలను పగులకొట్టి నగదును ఎత్తుకెళ్లారు.
Nandipet | మూడు ఆలయాల్లో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం (Renuka Yellamma Temple), మార్కండేయ ఆలయం (Markandeya Temple), దేవమ్మ ఆలయాల్లో (Devamma Temple) దొంగలు వరుసగా చోరీలకు పాల్పడ్డారు. ఆలయాల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు, హుండీలను పగలకొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఉదయం ఆలయాలకు వచ్చిన భక్తులు చోరీ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుసగా ఆలయాల్లో చోరీలు జరగడంతో భక్తులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయాల్లో భద్రత పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.