అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.. ఏకంగా ఐదు దుకాణాల్లో చోరీలకు పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో చోరీల (thefts) కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. దొంగలు తరచూ ఎక్కడో ఒకచోట చోరీలకు పాల్పడుతున్నారు.
Kamareddy | కామారెడ్డి పట్టణంలో..
పట్టణంలో (Kamareddy town) గురువారం అర్ధరాత్రి తర్వాత దుండగులు ఏకంగా ఐదు దుకాణాలలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో జిరాక్స్ షాప్, ఆన్లైన్, బ్యాంగిల్ స్టోర్‌తో పాటు కొత్త బస్టాండ్ ఏరియాలోని ప్రియా డీలక్స్ రోడ్డులో రెండు మొబైల్ దుకాణాల షట్టర్లను పగులగట్టి భారీగా నగదు, వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఐదు దుకాణాల్లో సుమారు రూ.5 లక్షల వరకు నగదు, వివిధ వస్తువులు దుండగులు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే బాధిత షాపుల యజమానులు దుకాణాలకు వెళ్లగా షట్లర్లు పగులగొట్టి ఉండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.