Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | తిరుమలయ్య గుడిలో చోరీ: వ్యక్తి అరెస్ట్​

Indalwai | తిరుమలయ్య గుడిలో చోరీ: వ్యక్తి అరెస్ట్​

మండలంలోని నల్లవెల్లి గ్రామంలోని తిరుమలయ్య ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలోని నల్లవెల్లి గ్రామంలోని (Nallavelli village) తిరుమలయ్య ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం తిరుమలయ్య ఆలయంలో చోరీ జరగగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు.

పక్కా సమాచారం మేరకు సోమవారం లింగపూర్ స్టేజ్ వద్ద అతడిని పట్టుకున్నామని అన్నారు. అతని వద్ద నుండి ఆరున్నర గ్రాముల బంగారం రూ. వేయి నగదు, ఒక సెల్​ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి (Nizamabad ACP Raja Venkat Reddy) ఆధ్వర్యంలో కేసును ఛేదించామన్నారు. కేసు ఛేదనలో సిబ్బంది కిరణ్ గౌడ్, ప్రశాంత్, కిషోర్ కుమార్ ముఖ్యపాత్ర పోషించారని, వీరిని సీఐ వినోద్ అభినందించారన్నారు.