HomeజాతీయంMaoists | వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

Maoists | వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

అగ్రనేతలు దేవ్​జీ, రాజిరెడ్డి తమతోనే ఉన్నారని మావోయిస్టులు స్పష్టం చేశారు. ఈ మేరకు వికల్ప్‌ పేరుతో లేఖ విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు మరో సంచలన ప్రకటన చేశారు. అగ్రనేతలు దేవ్​జీ, రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు మావోయిస్టు వికల్ప్‌ (Maoist Vikalp) పేరుతో శుక్రవారం లేఖ విడుదల చేశారు.

ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతేగాకుండా పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యుడు దేవ్​జీ పోలీసుల అదుపులో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. వారిని వెంటనే విడుదల చేయాలని మావోయిస్టులు సైతం లేఖ విడుదల చేశారు. దేవ్​జీపాటు మరో 50 మంది నక్సల్స్ (Naxals)​ను పోలీసులు పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. అయితే తాజాగా దేవ్​జీ తమతోనే ఉన్నారని వారు క్లారిటీ ఇచ్చారు.

Maoists | అది అవాస్తవం

హిడ్మా (Madvi Hidma) సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనడం అవాస్తవమని లేఖలో పేర్కొన్నారు. చికిత్స కోసం హిడ్మా విజయవాడ వెళ్లాడన్నారు. హిడ్మా ఎన్​కౌంటర్​కు నలుగురు వ్యక్తులే కారణమని ఆరోపించారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్​ వ్యాపారి, కాంట్రాక్టర్​ హిడ్మాను పోలీసులకు పట్టించారన్నారు. అక్టోబరు 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని వికల్ప్​ లేఖలో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు హిడ్మాను పట్టుకొని బూటకపు ఎన్​కౌంటర్​ (Encounter) చేశారని ఆరోపించారు. తాము లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు. మారేడుమిల్లి (Maredumilli) ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

Must Read
Related News