అక్షరటుడే, వెబ్డెస్క్:Viral Video | మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు.. కానీ ఆ ప్రతిభకు సరైన ప్రోత్సాహం అనేదే ఉండడం లేదు. ప్రభుత్వాలు ప్రతిభ ఉన్న వారిని గుర్తించి వారికి తగు శిక్షణ ఇస్తే దేశం ఇంకెంతో మెరుగుపుడుతుందనేది కొందరి మాట. అయితే వ్యర్థాలని అద్వితీయ కళాకృతులుగా మార్చుతున్న ఓ మహిళా బృందం(Womens Team) చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో(Viral Video)లో, కొంతమంది మహిళలు మొక్కజొన్న పొట్టుని ఉపయోగించి అందమైన పుష్పగుచ్ఛాలు తయారు చేస్తూ కనిపిస్తున్నారు.
Viral Video | గ్రేట్ టాలెంట్..
సాధారణంగా మొక్కజొన్న(Corn) తినే ముందు పైనున్న పొట్టుని తీసేసి పారేస్తాం. అవి పనికిరావని అలా చేస్తాము. కానీ ఈ మహిళలు మాత్రం వాటితో అద్భుతమైన హస్తకళను ప్రదర్శిస్తూ, వాటికి ప్రాణం పోస్తున్నారు. ఈ వీడియోలో వృద్ధ మహిళలతో పాటు యువతులు కలిసి ఒక్కొక్క తొక్కను శ్రద్ధగా మడతపెట్టి పూలలా తయారు చేస్తున్నారు. వీరి శ్రమ, నైపుణ్యం చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు, ఇది మహిళా సాధికారతకు ఒక చిహ్నంగా నిలుస్తోందంటూ అభినందనలు గుప్పిస్తున్నారు.ఈ వీడియోను Instagramలో @phooljafoundation అనే ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే ఇది వేల సంఖ్యలో లైక్‌లు, షేర్‌లు పొందింది.
ఇది నిజంగా అభినందించదగిన కళ, మీ సృజనాత్మకతకు హ్యాట్సాఫ్, ఇలా ప్రతి పనికిరాని వస్తువు వెనుక ఒక అందమైన కళ ఉంటుంది అనే సందేశాన్ని ఇచ్చారు అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో ద్వారా మరోసారి భారతీయులలో సృజనాత్మకత(Indians Creativity), అభిరుచి ఎంతగా ఉందో బయటపడింది. చెడిపోయే వస్తువుల్లోనూ కళను చూడగలగడం, వాటిని ఉపయోగకరంగా మార్చగలగడం అనేది నిజంగా గొప్ప విషయం అంటున్నారు.