- Advertisement -
HomeUncategorizedNew rules | నేటి నుంచి మారనున్న నిబంధనలివే..!

New rules | నేటి నుంచి మారనున్న నిబంధనలివే..!

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: మే 1 నుంచి అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇది మన జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. బ్యాంకు ఖాతా నుంచి ఏటిఎం లావాదేవీలు, వంట గ్యాస్ ధర వరకు ప్రతిదీ వీటితో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

New rules | ఏటీఎం మనీ డ్రా ఖరీదైనది

ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేయడంపై ఉచిత పరిమితి ముగిసింది. ఇకపై ఏటీఎం నుంచి డబ్బు తీసుకునే ప్రతిసారి రూ.19 చెల్లించాలి. గతంలో ఈ రుసుము రూ. 17 గా ఉండేది. దీనితో పాటు, బ్యాలెన్స్ చెక్ చేసినా రూ. 7 రుసుము చెల్లించాల్సిందే. గతంలో ఈ రుసుము రూ. 6 గా ఉండేది.

- Advertisement -

New rules | రైల్వే టికెట్ బుకింగ్‌ లో మార్పులు

రైల్వే టిక్కెట్ బుకింగ్(Railway ticket booking) నియమాలలో కొన్ని మార్పులు జరిగాయి. ఇకపై వెయిటింగ్ టిక్కెట్లు జనరల్ కోచ్‌లలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. స్లీపర్ కోచ్‌లో వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణించడం కుదరదు.

New rules | RRB పథకం అమలు

దేశంలోని 11 రాష్ట్రాల్లో ‘వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బి’ పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని మీనింగ్​.. ప్రతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలిసి ఒక పెద్ద బ్యాంకుగా రూపాంతరం చెందుతాయి. దీనివల్ల బ్యాంకింగ్ సేవలు మెరుగుపడతాయని చెబుతున్నారు. ఈ మార్పు ఉత్తర్​ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌ లో అమలవుతుంది.

New rules | ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మార్పు

ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను(LPG Cylinder price) సమీక్షిస్తారు. ఈసారి నేడు(మే 1న) కూడా గ్యాస్ సిలిండర్ ధరను సమీక్షించనున్నారు. ఈ ధర మన జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు.

New rules | ఎఫ్‌డీ (FD), పొదుపు ఖాతా వడ్డీ రేట్లలో మార్పులు

నేటి నుంచి FD, సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లలో(Saving account interest rates) మార్పులు ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటును రెండుసార్లు తగ్గించాక, చాలా బ్యాంకులు తమ ఖాతాదారుల పొదుపు ఖాతాలు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు తగ్గించాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News