అక్షరటుడే, వెబ్‌డెస్క్: Municipal election coordinators | మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా అత్యధిక కార్పొరేషన్, మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేందుకు నేతలందరినీ సమన్వయం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు (corporations and municipalities) సమన్వయ కర్తలను నియమించింది. కాగా.. నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీలకు కో–ఆర్డినేటర్లను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లా సమన్వయకర్తలు వీరే..
ఉమ్మడి జిల్లాకు సంబంధించి పలువురు ముఖ్య నేతలను సమన్వయకర్తలుగా నియమించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో టి.జీవన్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, బల్మూరి వెంకట్, ఈరవత్రి అనిల్‌ను నియమించారు. అలాగే ఆర్మూర్‌కు సముద్రాల వేణుగోపాల చారి, భీమ్‌గల్‌కు గాలి అనిల్ కుమార్, బోధన్‌కు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఇక కామారెడ్డికి షబ్బీర్‌అలీ, నేరెళ్ల శారద, బాన్సువాడకు సురేష్ షెట్కార్, ఎల్లారెడ్డికి ఎం.వేణుగౌడ్, బిచ్కుందకు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌ను నియమించారు.
2 comments
[…] […]
[…] […]
Comments are closed.