అక్షరటుడే, ఇందూరు: RSS Nizamabad | హిందూ సమాజంలో (Hindu society) అంటరానితనం లేదని.. రాముడు శబరి ఎంగిలి తినడం.. అరుంధతి నక్షత్రాన్ని చూడడం సమరసత జీవనానికి దర్పణమని ఆర్ఎస్ఎస్ ప్రధాన వక్త రాజుల్వార్ దిగంబర్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ శ్రీరామ్ ఉపనగరం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జనార్దన్ గార్డెన్ లో సంక్రాంతి ఉత్సవం (Sankranthi festival) నిర్వహించారు.
RSS Nizamabad | పంచ పరివర్తనతో సమాజ పరివర్తన..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచ పరివర్తన ద్వారా సమాజ పరివర్తన కోసం పాటుపడాలని రాజుల్వార్ దిగంబర్ సూచించారు. హిందువు హిందువుగా జీవించాలని తెలిపారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి దేశ సమైక్యత కోసం నిర్విరామ కృషి చేస్తుందన్నారు. శతాబ్ది వేడుకల్లో భాగంగా సంక్రాంతి పండుగ విశిష్టతను సందేశాన్ని ప్రతి హిందువు కుటుంబానికి అందజేయాలను కోరారు. కార్యక్రమంలో నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్యవాహ సుమిత్, అనిల్, అభిరామ్, శ్రవణ్, మృత్యుంజయ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.