Trump Tariffs | ట్రంప్​ సుంకాలపై భయపడాల్సిన అవసరం లేదు.. కాంగ్రెస్​ ఎంపీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | భారత్​పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ 25 సుంకాలు (Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత ఉత్పత్తులపై రేపటి నుంచి సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Ganhdi) కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. భారత్​ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని ట్రంప్​ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అయితే తాజాగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | భారత్​పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ 25 సుంకాలు (Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత ఉత్పత్తులపై రేపటి నుంచి సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Ganhdi) కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. భారత్​ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని ట్రంప్​ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అయితే తాజాగా కాంగ్రెస్​ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కుమారుడు కార్తీ చిదంబరం (Karti Chidambaram) కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సుంకాలపై అప్పుడే భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు చేసిన ప్రకటనపై కార్తీ చిదంబరం గురువారం స్పందించారు. ట్రంప్ సంప్రదాయ రాజకీయ నాయకుడు కాదని ఆయన పేర్కొన్నారు. సాధారణ దౌత్య ప్రొటోకాల్స్​, అంతర్ ప్రభుత్వ సంబంధాల సాధారణ నియమాలు అతడి దగ్గర పనిచేయవు అన్నారు. ఆయన అసాధారణమైన వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే సుంకాలపై మనం భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడ్డారు. ఇవన్నీ చర్చల్లో ప్రారంభ స్థానాలు అని తెలిపారు. ప్రభుత్వం ప్రశాంతంగా ఉంటుందని, చర్చలు కొనసాగించి, అమెరికాతో (America) అవగాహనకు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...