Eetala Rajender | నోటీసులకు భయపడేది లేదు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Etala Rajender | మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్​ కాళేశ్వరం కమిషన్​ నోటీసులపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ డిజైన్​ మార్పు, నిర్మాణ సమయంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం జస్టిస్ ఘోష్​ కమిషన్​(Justice Ghosh Commission)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కమిషన్​ ఈఎన్​సీలు సహా కీలక ఇంజినిర్లు, అధికారులను విచారించింది. తాజాగా మాజీ సీఎం  కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం నోటీసులు జారీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Etala Rajender | మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్​ కాళేశ్వరం కమిషన్​ నోటీసులపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ డిజైన్​ మార్పు, నిర్మాణ సమయంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం జస్టిస్ ఘోష్​ కమిషన్​(Justice Ghosh Commission)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కమిషన్​ ఈఎన్​సీలు సహా కీలక ఇంజినిర్లు, అధికారులను విచారించింది. తాజాగా మాజీ సీఎం  కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు.

Etala Rajender | ఆర్థిక మంత్రిగా ఈటల

బీఆర్​ఎస్(BRS)​ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈటల రాజేందర్(Eetala Rajender)​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. హరీశ్​ రావు(Harish Rao) నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో అప్పటి సీఎం కేసీఆర్(KCR)​తో పాటు, ఈటల, హరీశ్​రావుకు కమిషన్​ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, 9న ఈటల రాజేందర్​ను విచారణకు హాజరు కావాలని సూచించింది.

Etala Rajender | విచారణకు సహకరిస్తా..

కాళేశ్వరం కమిషన్​ ఈటల రాజేందర్(Eetala Rajender)​ స్పందించారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేని, అందాక సమాధానం చెబుతానని తెలిపారు. చట్టాలు, కోర్టులు, కమిషన్‌పై నమ్మకం ఉందని, కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తనతో పాటు మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరికి కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. తాను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...