అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని మహేష్ గౌడ్ ఆరోపించారు.
దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ (Bandi Sanjay) గెలిచేవారు కాదని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక్క MP సీటు కూడా గెలిచేది కాదన్నారు.
TPCC Chief Mahesh : దేవుడి పేరుతో ఓట్లు అడగలేదు..
బీజేపీలా తాము దేవుడి పేరుతో ఓట్లు అడగలేదని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. బీజేపీకి ఎన్నికలు ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడని ఆరోపించారు.
BCల గురించి బండి సంజయ్ మాట్లాడటం లేదన్నారు. BC బిల్లు (BC bill) పై మాట్లాడకుండా ముఖం చాటేశారని మహేష్‌గౌడ్ ఎద్దేవా చేశారు.
బండి సంజయ్ BC కాదని, ఒక దేశ్‌ముఖ్, దొర మహేష్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.