3
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నిజామాబాద్ నగరంలో శనివారం చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.
మూడో టౌన్ ఎస్హెచ్వో హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఇంద్ర ప్రియదర్శి కాలనీలో సాయి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. తాళం పగలగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. మూడు గ్రాముల బంగారం, రూ.20వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.