Homeజిల్లాలునిజామాబాద్​Balkonda | తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం గల్లంతు

Balkonda | తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం గల్లంతు

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన బాల్కొండ మండలం ఇత్వార్​పేట్​లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శైలేందర్​ వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ: Balkonda | తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన బాల్కొండ మండలం (Balkonda mandal) ఇత్వార్​పేట్​లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శైలేందర్​ (Sub-Inspector Shailender) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొండలక్ష్మి బుధవారం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది.

దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి జత బంగారు కమ్మలు(5 గ్రాములు), రూ.వేలు చోరీకి గురైనట్లుగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Must Read
Related News