66
అక్షరటుడే, బాన్సువాడ: Varni Mandal | వర్ని పోలీస్ స్టేషన్ (Varni Police Station) పరిధిలోని మోస్రాలోని పెద్దమ్మ గుడిలో ఆదివారం చోరీ జరిగింది. గ్రామంలోని పెద్దమ్మ గుడి (Peddamma temple) గేట్‌కు వేసిన తాళాన్ని దుండగులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు.
Varni Mandal | వెండి కిరీటం.. బంగారు పుస్తెలు..
ఆలయంలో ఉన్న విగ్రహానికి ఉన్న వెండి కిరీటం (silver crown), సుమారు 6 గ్రాముల బంగారు పుస్తెలను చోరీ చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వర్ని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అయితే ఈ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నిందితులను హైదరాబాద్‌లో పట్టుకున్నట్లు సమాచారం.