అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prakasam District | వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇటీవల హత్యలు పెరిగాయి. తాజాగా ఓ మహిళ జైలులో ఉన్న తన భర్తకు బెయిల్ ఇప్పించి మరి హత్య చేసింది.రంగస్థలంలో సినిమాలో విలన్ ప్రకాశ్‌రాజ్ కోలుకున్న తర్వాత హీరో రామ్‌చరణ్ హత్య చేస్తాడు. అలాగే ఓ మహిళ గంజాయి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్తకు బెయిల్ ఇప్పించింది. బయటకు వచ్చిన తర్వాత హత్య దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఏపీ (Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
Prakasam District | విషయం తెలియడంతో..
పెద్ద దోర్నాల (Pedda Dornala)కు చెందిన లాల్ శ్రీను ఇటీవల గంజాయి కేసులో జైలుకు వెళ్లాడు. ఆయనకు భార్య ఝాన్సీ ఉంది. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం శ్రీనుకు తెలిసింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కడ భర్త తనను హత్య చేస్తాడోనని అనుమనించిన ఝాన్సీ అతడిని అంతం చేయాలని ప్లాన్ వేసింది. ఈ మేరకు మార్కాపురం (Markapuram) సమీపంలోని పెద్దారవీడు మండలం అంకాలమ్మ గుడి (Ankalamma Temple) దగ్గర లాల్ శ్రీనును హత్య చేసింది. జైలు నుంచి తీసుకొస్తూ తమ్ముడితో కలిసి శ్రీను కళ్లలో కారం కొట్టి, కత్తులతో పొడిచి చంపించింది.
Prakasam District | రెండు రోజుల్లో..
లాల్ శ్రీను డ్రైవర్‌గా పని చేస్తూ జీవించేవాడు. డబ్బు సంపాదించాలని గంజాయి వ్యాపారం ప్రారంభించాడు. శ్రీను బావమరిది అశోక్ పెద్దదోర్నాలో మెకానిక్ షాపు నడుపుతున్నాడు. పక్కనే ఝాన్సీ కూల్ డ్రింక్ షాప్ నిర్వహించేంది. అశోక్ దగ్గరకు తరచూ వచ్చే సూర్యనారాయణ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలియడంతో శ్రీను భార్యను మందలించాడు. ఈ క్రమంలో అతడు జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చాక తనను చంపుతాడని భావించిన ఆమె తమ్ముడు, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పోలీసులు రెండు రోజుల్లో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.