అక్షరటుడే, కామారెడ్డి : TNGOS Kamareddy | టీఎన్జీవోస్ ఏర్పడి 80ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా త్వరలో ఎల్బీ స్టేడియంలో (LB Stadium) 80 వసంతాల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో (R&B Guesthouse) మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
TNGOS Kamareddy | ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం..
ఉద్యోగుల సమస్యలపై ప్రతినిత్యం పోరాటం చేసే ఏకైక సంఘం టీఎన్జీవోస్ అని మారం జగదీశ్వర్ అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్స్ (Pending Bills) మంజూరు చేయించడంలో ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతినెలా సుమారుగా రూ.750 కోట్లు జమ చేయిస్తూ ఇప్పటివరకు రూ.4,700 కోట్లకు పైగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను ఇప్పించుకోగలిగామని చెప్పారు. త్వరలో ఉద్యోగులకు హెల్త్ కార్డులు వస్తాయని తెలిపారు.
TNGOS Kamareddy | సభకు సీఎం రేవంత్‌రెడ్డి..
త్వరలో నిర్వహించబోయే 80 వసంతాల సభకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేంద్ర మంత్రులు హాజరవుతారని జగదీశ్వర్ తెలిపారు. ఈ సభలోనే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించే దిశగా ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు కేంద్ర సంఘ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్, పోచయ్య, అర్బన్ యూనిట్ బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఆర్అండ్బీ ఫోరం అధ్యక్షుడు సంపత్ తదితరులు పాల్గొన్నారు.