అక్షరటుడే, వెబ్డెస్క్ : Donald Trump | ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఇరాన్‌లో కొద్ది రోజులుగా నిరసనలు (Iran protests) కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రజలపై దాడులు జరుగుతున్నాయన్నారు. అక్కడ కొనసాగుతోన్న హింసకు ఖమేనీనే (Khamenei) కారణమని ఆరోపణలు చేశారు. ఆయన వేలాది మందిని చంపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald Trump | కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి
ఇంత మంది ప్రాణాలు తీసిన ఖమేనీ దేశాన్ని పాలించడానికి అర్హుడు కాదని ట్రంప్ అన్నారు. ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలన్నారు. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. కాగా శనివారం ఖమేని మాట్లాడుతూ.. ఇరాన్‌లో ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు.