అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court on DGP | తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
శివధర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం (State Government) సెప్టెంబరు 26న డీజీపీగా నియమించింది. ఆయనకు ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన నియామకం చెల్లదంటూ హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక పద్ధతిలో డీజీపీని నియమించడానికి వీల్లేదని ఆయన వాదించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేయడానికి నిరాకరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.
Supreme Court on DGP | త్వరగా పూర్తి చేయాలి
హైకోర్టు (High Court) తీర్పుపై పిటిషనర్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం డీజీపీ శివధర్ రెడ్డి నియమాకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సీజేఐ ధర్మాసనం ఏకీభవించింది.పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని యూపీఎస్సీని, తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Government) ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాను పరిశీలించాలని సూచించింది. ఇన్‌ఛార్జి డీజీపీ నియామాకాన్ని తప్పు పట్టలేమని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.