అక్షరటుడే, భీమ్‌గల్ : Hockey Competitions | మండలంలోని పల్లికొండ గ్రామానికి (Pallikonda Village) చెందిన విద్యార్థిని మాలావత్ అఖిల జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఇటీవల నిర్వహించిన ఎస్‌జీఎఫ్ (SGF) అండర్-17 బాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో అఖిల అద్భుత ప్రతిభ కనబర్చి రెండోస్థానంలో నిలిచింది.
ఈ ప్రతిభ ఆధారంగా జాతీయ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం అనురాధ తెలిపారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే జాతీయస్థాయి హాకీ టోర్నీలో అఖిల పాల్గొంటుందని పేర్కొన్నారు.
Hockey Competitions | ఆర్థిక సాయం అందజేత..
జాతీయస్థాయికి ఎంపికైన అఖిలను పల్లికొండ సర్పంచ్ (Pallikonda Sarpanch) గొల్లపిండి మనీషా అశోక్ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారిణికి ప్రోత్సాహకంగా తన వంతుగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ స్థాయిలో గ్రామానికి, జిల్లాకు పేరు తీసుకురావడం గర్వకారణమని సర్పంచ్ కొనియాడారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుపోతుల చిన్న బాలయ్య, జిల్లా హాకీ ముఖ్య కార్యదర్శి సదామస్తుల రమణ, భీమ్‌గల్ మండల (Bheemgal Mandal) పీఆర్‌టీయూ (PRTU) అధ్యక్షుడు ఎడ్ల శేఖర్, వీడీసీ ప్రతినిధులు వడ్యాల లక్ష్మణ్, దొనకంటి రాజేష్, సుంకరి గంగాధర్ పాల్గొన్నారు. అలాగే సీనియర్ క్రీడాకారులు శివ, రాజు, సృజన్, సీనియర్ ఉపాధ్యాయులు విఠల్ గౌడ్ మరియు పాఠశాల సిబ్బంది అఖిలకు శుభాకాంక్షలు తెలిపారు.