అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | రాష్ట్రంలో రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దుర్మార్గంంగా సాగుతోందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) సాగించిన రెండేళ్ల పాలనలో అవినీతి అక్రమాలే ఉన్నాయని దుయ్యబట్టారు.
చివరికి హిందువులపై సైతం చులకనగా మాట్లాడే స్థాయికి సీఎం దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు రూ.2వేల కోట్ల భూములను అమ్ముకుంటున్నారన్నారు. రాష్ట్రంలో భూములన్నీ అమ్ముకుంటూ భవిష్యత్తు తరాలకు భూమి లేకుండా చేస్తూ కాంగ్రెస్ పాలన సాగిస్తోందన్నారు.
సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే గుంట భూమి లేకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని యువత ప్రజల ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాకష్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు రూ.300 ఇందిరమ్మ చీరలు ఇచ్చి, పెంచుతామన్న పింఛన్లు ఎగ్గొట్టారన్నారు. వృద్ధులు మహిళలు ఈ ప్రభుత్వం భరతం పట్టాలన్నారు. గత ప్రభుత్వం సగం భూములు అమ్మితే ఈ ప్రభుత్వ మొత్తం భూములను అమ్మేస్తుoదన్నారు. సిరిగల్ల తెలంగాణను ఒకడు తాకట్టు పెడితే, ఇప్పుడు వచ్చినోడు మొత్తం భూములను అమ్మేస్తున్నాడని విమర్శించారు.
ఈ దుర్మార్గాలను ఆపాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీని గెలిపించాలన్నారు. తెలంగాణలో సైతం బీజేపీ ఫార్మాట్ మార్చాలన్నారు. మహారాష్ట్ర, బీహార్‌లాగా తెలంగాణలో సైతం కాషాయ జెండా ఎగరాలన్నారు. తెలంగాణలో ఫార్మాట్ మార్చాలని గెలుపొందే సత్తా, దమ్ము ఉన్న వాళ్లకే అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్ని మ్యాచ్‌లు ఆడినం అన్నది ముఖ్యం కాదని గెలిచామా లేదా అన్నది ముఖ్యమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలాగా రాష్ట్ర అధినాయకత్వం అడుగులు వేయాలన్నారు. తెలంగాణ సచివాలయంపై బీజేపీ జెండా ఎగరాలన్నారు.