అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpally | మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) జరగనున్నాయని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో రాజ శ్రీనివాస్ (MPDO Raja Srinivas) తెలిపారు. 14 గ్రామ పంచాయతీలకు, వార్డ్ మెంబర్లకు ఈనెల మూడో తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. అందుకు గాను 4 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మొదటి క్లస్టర్ కమ్మర్‌పల్లిలో కమ్మర్పల్లి, నాగపూర్, ఉప్పులూరు, ఆర్ఆర్ నగర్ జీపీలకు సంబంధించిన సర్పంచ్, వార్డు మెంబర్లు నామినేషన్లను (Nominations) వేయాల్సి ఉంటుందని కె రాజన్న రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. చౌటుపల్లిలో చౌటుపల్లి, బషీరాబాద్, హాసాకొత్తూరు జీపీలకు రిటర్నింగ్ అధికారిగా గంగాధర్, మూడో క్లస్టర్ కోనసముందర్‌లో.. కోన సముందర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్, అమీర్ నగర్ జీపీలకు మధుపాల్, నాలుగో క్లస్టర్ కోనాపూర్‌లో.. కోనాపూర్, డీసీ తండా, కేసీ తండా గ్రామపంచాయతీలకు నామినేషన్లు వేయుటకు రిటర్నింగ్ అధికారిగా సీహెచ్ రాంప్రసాద్ వ్యవహరిస్తారని కమ్మర్పల్లి ఎంపీడీవో తెలిపారు.
