Lingampet | రెండో పెళ్లి చేసుకుంటానన్న తండ్రి.. గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

అక్షరటుడే, లింగంపేట : Lingampet | తన తల్లిని కాదని మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన తండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన లింగంపేట(Lingampet ) మండలం అయ్యపల్లితండా(Ayyapalli thandaలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యపల్లి తండాకు చెందిన దేవ సోత్ ఫకీరాకు(46)కు పంగీ అనే మహిళతో 25 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు ప్రకాశ్​ నాయక్​, కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశారు. […]

అక్షరటుడే, లింగంపేట : Lingampet | తన తల్లిని కాదని మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన తండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన లింగంపేట(Lingampet ) మండలం అయ్యపల్లితండా(Ayyapalli thandaలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యపల్లి తండాకు చెందిన దేవ సోత్ ఫకీరాకు(46)కు పంగీ అనే మహిళతో 25 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు ప్రకాశ్​ నాయక్​, కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేశారు.

ఫకీరా పర్మల్ల తండాకు చెందిన ఓ మహిళను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే దీనికి కుమారుడు వ్యతిరేకించాడు. పెళ్లీడుకు వచ్చిన కుమారుడు ఉండగా.. రెండో పెళ్లి ఎందుకుని ఇంట్లో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీలు జరగ్గా తండావాసులు, బంధువులు సర్ది చెప్పారు. అయితే శనివారం రాత్రి సైతం తండ్రి కొడుకులు మరోసారి గొడవ పడ్డారు.

ఈ క్రమంలో ఇటీవల కొత్తగా నిర్మించిన ఇంటిని గ్యాస్​ సిలిండర్​కు నిప్పు అంటించి పేల్చేస్తా అని ఫకీరా అన్నాడు. దీంతో ఆవేశానికి గురైన ఆయన కుమారుడు ప్రకాశ్​ గొడ్డలితో తండ్రిని నరికాడు. తీవ్రంగా గాయపడ్డ ఫకీరా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏఎస్సై ప్రకాష్ నాయక్ తెలిపారు.

Related articles

Alphazolam seized | నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత.. విలువ రూ. 1.60 లక్షలపైనే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Alphazolam seized | నిజామాబాద్​ జిల్లాలోని జోజిపేట్​లో నిషేధిత ఆల్ఫాజోలం పట్టుబడింది. నిజామాబాద్​ నార్కొటిక్​ ఇన్​స్పెక్టర్​ Narcotics Inspector పూర్ణేశ్వర్​, నందిపేట్​...

Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు,...

PM Narendra Modi | ఇజ్రాయెల్‌ పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం : ప్రధాని మోడీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: PM Narendra Modi | గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదంతో పోరాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Prime Minister...

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...