అక్షరటుడే, వెబ్డెస్క్ : America | అమెరికాలో మంచు తుపాన్ (Snow Storm) బీభత్సం సృష్టిస్తోంది. గడ్డ కట్టే చలిలో 15 కోట్ల మంది ప్రజలు వణికిపోతన్నారు. మంచు ప్రభావంతో 1,800 విమానాలు రద్దు అయ్యాయి.
అమెరికా అంతటా వీస్తున్న భారీ శీతాకాల తుఫాను లక్షలాది మంది రోజువారీ జీవితాన్ని దెబ్బతీసింది, విమానాలు నిలిచిపోవడం, పాఠశాలలు మూసివేయడం, మంచు గడ్డకట్టడంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ విమానాలు (Airplanes) ఆలస్యం అయ్యాయి. శనివారం సైతం భారీగా విమానాలు రద్దు అయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిలో సగానికి పైగా డల్లాస్ ప్రాంతంలో ఉన్నాయని ఫ్లైట్అవేర్ తెలిపింది.
America | ఎటు చూసినా మంచు..
తుపాన్ ప్రభావంతో అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఎటు చూసిన మంచు కనిపిస్తోంది. చెట్లు, భవనాలు, రోడ్లు మంచుతో కప్పుకుపోయాయి. హిమపాతంతో ఎటు చూసిన తెల్లని మంచు కొండలు దర్శనం ఇస్తున్నాయి. ఆర్కిటిక్ ఎయిర్ ఫోర్స్ మిడ్‌వెస్ట్ (Arctic Air Force Midwest)లోని పాఠశాలలను మూసివేసింది. చికాగో, ఇతర మిడ్‌వెస్ట్రన్ నగరాల్లో, చలి చాలా తీవ్రంగా ఉండటంతో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. తుపాన్ ఈశాన్య దిశగా కదులుతుందని, వాషింగ్టన్, నుంచి న్యూయార్క్, బోస్టన్ మీదుగా ఒక అడుగు వరకు మంచు కురుస్తుందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. అధికారులు రోడ్లపై కప్పుకున్న మంచును తొలగిస్తున్నారు. కాగా మంచు తుపాన్ ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో అధికారులు అత్యవసర బృందాలను మోహరించారు.