Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ‘సర్’​​ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

Collector Nizamabad | ‘సర్’​​ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్​ఐఆర్​) సన్నాహక ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కమ్మర్​పల్లి, ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయాలను పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Collector Nizamabad | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్​ఐఆర్​) సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. కమ్మర్​పల్లి, ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం సందర్శించారు.

తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో ఎస్ఐఆర్ (Special Intensive Revision) సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్షించారు. 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత 2025 ఓటరు జాబితాను సరిపోల్చుతూ వివరాలు రూపొందించారా అని పరిశీలించారు. నిర్దిష్ట గడువులోపు ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భూభారతి (Bhubharati), గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా ఏవైనా అర్జీలు పెండింగ్​లో ఉంటే, వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు.

ఆయా మాడ్యూల్స్​లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదాబైనామా అర్జీల్లో ఎన్ని ఆమోదం పొందాయి. ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.. పీవోటీ భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే, అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు.
చిన్నచిన్న కారణాలతో దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదని, క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరిపి అర్హులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తులను ఆమోదించాలన్నారు.

ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే, అందుకు ఉన్న కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, అవి భూభారతి మార్గదర్శకాలకు లోబడి ఉండాలన్నారు. ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కరణకు గురైన సాదాబైనామా దరఖాస్తుల వివరాలను ఆన్​లైన్​లో రెండు రోజుల్లోపు పూర్తిస్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహశీల్దార్లు ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ, వాటిని ఏ మాడ్యుల్​లో పరిష్కరించవచ్చనే అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట కమ్మర్​పల్లి, తహశీల్దార్ ప్రసాద్, ఆర్మూర్ తహశీల్దార్ సత్యనారాయణ తదితరులున్నారు.