అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sim Binding | దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కువ శాతం సైబర్ క్రైమ్‌లు (Cyber Crimes) టెలిగ్రాం, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇక నుంచి సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై, సిగ్నల్ వంటి కమ్యూనికేషన్ యాప్స్ పని చేసేలా నిబంధన తీసుకు వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం సిబ్ బైండింగ్‌ను తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఫోన్‌పే (Phone Pay), గూగుల్ పే (Google Pay) వంటి యూపీఐ సేవలకు సిమ్ బైండింగ్ తప్పనసరి. ఫోన్లో సిమ్ ఉంటేనే యూపీఐ ద్వారా డబ్బులు పంపే వీలు ఉంటుంది. అయితే వాట్సాప్, టెలీగ్రామ్ వంటి యాప్‌లకు ఒకసారి అకౌంట్ తీసుకున్న తర్వాత సిమ్ లేకున్నా.. సేవలు పొందవచ్చు. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే యాప్ సర్వీసులను పనిచేసేలా చూడాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆయా సంస్థలను ఆదేశించింది. 90 రోజుల్లో ఈ నిబంధన అమలు చేయాలని పేర్కొంది.
Sim Binding | కొత్త నిబంధనలతో..
టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు నోటిఫై చేసిన తర్వాత సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. ఇది టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీ (TIUE) వర్గాన్ని టెలికమ్యూనికేషన్ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్‌లకు పంపబడిన కొత్త ఆదేశాలు ఈ కంపెనీలను TIUEలుగా సమర్థవంతంగా గుర్తిస్తాయి. రాబోయే 90 రోజుల్లోపు సిమ్ కార్డులు తమ సేవలకు నిరంతరం లింక్ చేయబడి ఉండేలా చూసుకోవడానికి వారికి ప్లాట్‌ఫారమ్‌లు అవసరం. వెబ్‌సైట్ లేదా వెబ్-యాప్ ఆధారిత యాక్సెస్ కోసం వినియోగదారులు ఆరు గంటలలోపు లాగ్ అవుట్ అయ్యారని నిర్ధారించుకోవాలి. QR-కోడ్ ఆధారిత పద్ధతి ద్వారా ఖాతాలను తిరిగి లింక్ చేసే అవకాశం కల్పించాలి.
కస్టమర్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌లను ఉపయోగించే కొన్ని యాప్‌లు.. తర్వాత ఫోన్లో సిమ్ లేనప్పుడు కూడా యాక్సెస్‌ను అనుమతిస్తాయని ప్రభుత్వం గమనించింది. ఇది భారతదేశం వెలుపల నుండి సైబర్ మోసానికి పాల్పడటానికి కారణం అవుతోందని గుర్తించింది. దీంతో సిమ్ బైండింగ్‌ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి మొబైల్ సిమ్ తీసేస్తే ఆటోమేటిక్‌గా వాట్సాప్ నుంచి లాగౌట్ అయిపోతుంది. మళ్లీ సిమ్ వేశాక లాగిన్ కావాల్సి ఉంటుంది.