అక్షరటుడే, కామారెడ్డి: Science Fair | కామారెడ్డి పట్టణంలోని విద్యానికేతన్ పాఠశాలలో (Vidyaniketan School)బుధవారం రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Incharge Minister Seethakka, ) హాజరవుతారని భావించినా అనివార్య కారణాలతో రాలేకపోయినట్టు సమాచారం. దాంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Science Fair | రాష్ట్ర నలుమూలల నుంచి
సైన్స్‌ఫేర్ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు సంబంధించిన 1,700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్‌లో 880 ప్రాజెక్ట్‌లను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలను షబ్బీర్ అలీ తిలకించారు. ప్రదర్శనలకు సంబంధించిన వివరాలను విద్యార్థులు అడిగారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు జరగాలన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.
Science Fair | కాంగ్రెస్ వచ్చాకే..
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మిడ్ డే మిల్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్ ఛార్జీలు(Cosmetic charges) 200శాతం పెంచిందని షబ్బీర్ అలీ తెలిపారు. ఎంపీ సురేష్ షెట్కార్(MP Suresh Shetkar) మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ బలపడాలంటే నూతన ఒరవడి అయిన ఏఐ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాటిలైట్ టెక్నాలజీ హైడ్రోజన్ ఎనర్జీ వంటి నూతన విధానాలకు ప్రేరణ కల్పించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అలాంటి ఆవిష్కరణలనే విద్యార్థులు చేసేలా ప్రోత్సహించాలన్నారు. అప్పుడే నూతన భారతం నిర్మితమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సృజనాత్మకత ప్రతి ఒక్క విద్యార్థుల్లోనూ ఉంటుందని దానిని వెలికితీసి సరైన మార్గంలో వారికి మార్గనిర్దేశం చేయడమే సైన్స్ ఉపాధ్యాయుల కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, ఎన్సీఆర్టీ డైరెక్టర్ రమేష్, ఆర్జేడీ సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.


