75
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Bodhan | స్కూల్ వ్యాన్ (School Van) అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన బోధన్ పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది.
Bodhan | అదుపుతప్పి కాలువలోకి..
బోధన్ పట్టణానికి చెందిన సాయి ప్రసన్న స్కూల్ (Sai Prasanna School) వ్యాన్ సాయంత్రం వేళ విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. ఈక్రమంలో పట్టణ శివారులోని చిక్కి చెరువు (Chikki Pond) వద్ద అదుపుతప్పి పక్కనున్న కాలువకు దూసుకెళ్లింది. అయితే ఈ సంఘటనలో వ్యాన్లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.