అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Greenland | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Putin) గ్రీన్‌ల్యాండ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు సంబంధం లేదని విషయమని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఇటీవల గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అక్కడ రష్యా, చైనా సైనిక కార్యకలాపాలను పెంచుతున్నాయనే కారణంతో దానిని అమెరికాలో విలీనం చేసుకోవాలని చూశారు. అయితే యూరప్ దేశాలు వ్యతిరేకించడంతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. తాజాగా గ్రీన్‌ల్యాండ్ విషయంలో పుతిన్ స్పందించారు. అమెరికా (America), దాని నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) మిత్రదేశాలు ఈ విషయాన్ని తమలో తాము పరిష్కరించుకుంటాయని అన్నారు. గ్రీన్‌లాండ్‌కు సంబంధించి పెరుగుతున్న దౌత్య ఉద్రిక్తతలలో మాస్కో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అది రష్యా ప్రయోజనాలకు సంబంధం లేనిదని కొట్టిపారేశారు. “గ్రీన్‌లాండ్‌కు ఏమి జరిగినా అది మనకు సంబంధించిన విషయం కాదు,” అన్నారు.
Greenland | అమెరికాకు అనుకూలంగా..
గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికాకు అనుకూలంగా పుతిన్ మాట్లాడటం గమనార్హం. డెన్మార్క్(Denmark) ఎల్లప్పుడూ గ్రీన్‌ల్యాండ్‌ను ఒక కాలనీగా పరిగణించిందని ఆయన పేర్కొన్నారు. దాని పట్ల చాలా కఠినంగా ఉందన్నారు. ఈ విషయాన్ని వారు తమలో తామే పరిష్కరించుకుంటారని ఆయన ఆశించారు. కాగా గ్రీన్‌ల్యాండ్ విషయంలో మాస్కో స్పందన రష్యా–ఉక్రెయిన్ వార్ నుంచి దృష్టి మరల్చడానికి అనికి యూరోపియన్ దేశాలు పేర్కొంటున్నాయి.