Home » Local Body Elections | ఎల్లారెడ్డి డివిజన్​లో తేలిన లెక్క.. 104 జీపీల్లో 645 సర్పంచ్ అభ్యర్థుల పోటీ

Local Body Elections | ఎల్లారెడ్డి డివిజన్​లో తేలిన లెక్క.. 104 జీపీల్లో 645 సర్పంచ్ అభ్యర్థుల పోటీ

by kiran
0 comments
Local Body Elections

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Local Body Elections | పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నేపథ్యంలో ఎల్లారెడ్డి డివిజన్ (Yella Reddy division) పరిధిలోని 4 మండలాల్లో రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు   ముగిసింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. రెండో విడతలో ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో 104 గ్రామపంచాయతీలల్లో 645 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 492 వార్డు ల్లో 1,370 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Local Body Elections | గుర్తుల కేటాయింపులు..

బరిలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. అభ్యర్థుల ప్రచారహోరు జోరుగా కొనసాగుతుంది. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలో ఆదివారం అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికలు సైతం నిర్వహించారు. 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామపంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి.

ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్(Nagireddy Pet), లింగంపేట్, గాంధారి మండలాల్లో 40 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మరో ఆరు గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా వార్డు సభ్యులకు పలు స్థానాలకు పోటీ నెలకొంది. గాంధారి మండలంలో 18, లింగంపేట మండలంలో 14, నాగిరెడ్డిపేటలో 6, ఎల్లారెడ్డిలో 5 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడుతల్లో జరిగేనా సదాశివ నగర్​లో మూడు, రాజంపేటలో రెండు, పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

Local Body Elections | గాంధారి మండలంలో..

మేడిపల్లి, చిన్నపూర్, దుర్గం, గుడి వెనుక తండా, హేమ్లా నాయక్ తండా, తాయి తండా లొంకతండా ,నేరెళ్ల తండా, పిప్పిల్ గుట్ట తండా, రాంపూర్ గడ్డ, సోమరం, మాతు సంగం, సోమ్లా నాయక్ తండా, పరిమళ్ల తండా, తిప్పారం తండా ఏకగ్రీవమయ్యాయి.

Local Body Elections | లింగంపేట్ మండలంలో..

లింగంపల్లి కుర్దు, ఒంటరిపల్లి బాయంపల్లి తండా, బానాపూర్, బాణాపూర్ తండా, సంధ్యా నాయక్ తండ మెంగారం, మంభోజిపల్లి తండా, నల్లమడుగు పెద్దతండ, రాంపల్లి, రాంపల్లి స్కూల్ తండా, సజ్జనపల్లి, ఎల్లారం ఉన్నాయి.

Local Body Elections | ఎల్లారెడ్డి మండలంలో..

ఆజామాబాద్, హాజీపూర్ తండా, సోమరగడి తండా, తిమ్మాపూర్, తిమ్మారెడ్డి తండా ఏకగ్రీవం కాగా.. సదాశివనగర్ మండలంలో..సత్య నాయక్ తండా, తిరుమన్ పల్లి, తుక్కోజి వాడి, రాజంపేట మండలంలో గుడి తండా, షేర్ శంకర్ తండాలు ఏకగ్రీవమయ్యాయి.

++++

You may also like