62
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Police Prajavani | పోలీస్ ప్రజావాణిలో 33 ఫిర్యాదులు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు సోమవారం సీపీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
Police Prajavani | చట్టపరంగా పరిష్కారానికి ఆదేశాలు
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదుల నిమిత్తం సీపీ ఆఫీస్కు రావొచ్చన్నారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఫిర్యాదులు సమర్పించి వారి పరిష్కారం కోరే హక్కు ప్రజలకు ఉందన్నారు. అనంతరం ఫిర్యాదుదారులతో మాట్లాడి చట్టపరంగా సమస్యల పరిష్కారం నిమిత్తం సంబంధిత పోలీస్స్టేషన్ల సీఐలకు, ఎస్సైలకు సమాచారం అందించారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం (Prajavani Program) నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.