అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | పెర్కిట్ నుండి మెట్పల్లి (Metpally) మీదుగా 63వ జాతీయ రహదారిపై (National Highway) ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రహదారిపై ప్రతినిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొంటున్నారు.
Kammarpally | రోడ్లపైకి వస్తున్న చెట్ల కొమ్మలు..
వర్షాల కారణంగా (Heavy rains) రోడ్డు మొత్తం గుంతలతో నిండిపోగా.. ఈదురు గాలులతో చెట్లు, పిచ్చిమొక్కలు రోడ్డుపైకి వచ్చి ఎదురుగా వచ్చే వాహనాలను కనిపించట్లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని.. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు కనీసం ఈ రహదారి వైపు కన్నెత్తి చూడడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kammarpally | పెర్కిట్ నుంచి..
పెర్కిట్ (Perkit) నుంచి కమ్మర్పల్లి, మెట్పల్లి వరకు రోడ్డు అధ్వానంగా తయారైందని.. బైక్పై వెళ్లాలంటే సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు తెలిపారు. కోరుట్ల నుంచి కరీంనగర్ వరకు ఫోర్ వే లైన్ రహదారి మంజూరైనప్పటికీ.. మెట్పల్లి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోందని వారు ఇబ్బందులు పడుతున్నారు. ఫోర్ వే లైన్ అయ్యే వరకు గుంతలను పూడ్చివేయాలని.. రోడ్డుకు అడ్డుగా వస్తున్న చెట్లు, ముళ్లపొదలను తొలగించాలని వారు కోరుతున్నారు.
