అక్షరటుడే,ఆర్మూర్: Mla Prashanth Reddy | కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు గమనిస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలోని (Armoor Municipality) 17వ వార్డుకు చెందిన నాయకులు ఇమ్రాన్, ఆయన సతీమణి కౌసర్ బేగంతో పాటు 500 మంది కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
రెండేళ్లు గడుస్తున్నా హామీలు అమలు కావట్లేదు..
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. మహిళలకు రూ.2,500, పెన్షన్ రూ.4,000కు పెంపు, కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ (Shaadi Mubarak) లబ్ధిదారులకు తులం బంగారం వంటి హామీలు ఏవీ అమలు కాలేదని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి (Revanth reddy) మాయమాటలు నమ్మి మోసపోయామని ఆర్మూర్ ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్, జీవన్ రెడ్డిల నాయకత్వాన్ని ప్రజలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత పదేళ్ల కాలంలో కేసీఆర్, కేటీఆర్ సహకారంతో జీవన్ రెడ్డి ఆర్మూర్‌లో రూ. వందల కోట్లతో అభివృద్ధి చేశారని కొనియాడారు. కాంగ్రెస్కు ప్రజలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, ఆర్మూర్ మున్సిపాలిటీపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.