అక్షరటుడే, ఇందూరు : Vande Mataram | స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతర గేయం కోట్లాదిమంది భారతీయుల్లో దేశభక్తిని నింపిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం కంఠేశ్వర్లోని వివేకానంద పాఠశాలలో సామూహిక గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంకించంద్ర చటర్జీ జ్ఞాపకార్థం యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. వందేమాతర గేయం (Vande Mataram Song) స్ఫూర్తితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం కొనసాగిందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సాయి రెడ్డి, బీజేపీ నాయకులు ఆనంద్ రావు, సాయి ప్రవీణ్, మఠం పవన్, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.