అక్షరటుడే, ఆర్మూర్ : Municipal Elections | కాంగ్రెస్ పార్టీ (Congress Party) సర్వేలో ప్రజల మద్దతు ఉన్నవారికే మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫాం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పెద్దలు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలపై నిజామాబాద్ పార్లమెంటరీ (Nizamabad Parliamentary) స్థాయి సమావేశాన్ని గురువారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో (Gandhi Bhavan) నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Municipal Elections | అభిప్రాయ సేకరణ..
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మున్సిపల్ ఎన్నికలపై ఆర్మూర్ ప్రాంత నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఖనిజాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఛైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, మాజీమంత్రి మoడవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్, ఏబీ చిన్న (శ్రీనివాస్), ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబాగౌడ్, ఖాందేశ్ శ్రీనివాస్, సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, మారుతి రెడ్డి పాల్గొన్నారు.