Maoists Surrender | కొనసాగుతున్న మావోల లొంగు‘బాట’.. ఛత్తీస్​గఢ్​లో 37 మంది సరెండర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists Surrender | మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాలు చొచ్చుకు వస్తుండడం, కీలక నేతలు నేలకొరుగుతుండడంతో నక్సల్స్​ లొంగిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం పునరావాసం కల్పిస్తుండడంతో ఆయుధాలను వీడుతున్నారు. తాజాగా ఛత్తీస్​గఢ్​లో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతేవాడ ఎస్పీ ఆఫీస్‌లో ఆదివారం 37 మంది సరెండర్​ అయ్యారు. వారిపై రూ.67 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించడానికి ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం (Chhattisgarh Government) “పూనా మార్గెమ్” (పునరావాసం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists Surrender | మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాలు చొచ్చుకు వస్తుండడం, కీలక నేతలు నేలకొరుగుతుండడంతో నక్సల్స్​ లొంగిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం పునరావాసం కల్పిస్తుండడంతో ఆయుధాలను వీడుతున్నారు. తాజాగా ఛత్తీస్​గఢ్​లో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

దంతేవాడ ఎస్పీ ఆఫీస్‌లో ఆదివారం 37 మంది సరెండర్​ అయ్యారు. వారిపై రూ.67 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించడానికి ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం (Chhattisgarh Government) “పూనా మార్గెమ్” (పునరావాసం నుంచి సామాజిక పునరేకీకరణ వరకు) కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చాలా మంది సరెండర్​ అవుతున్నారు. తాజాగా.. 37 మంది లొంగిపోయారని, వారిలో 12 మంది మహిళలు ఉన్నట్లు దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు.

Maoists Surrender | కీలక నేతలు

లొంగిపోయిన వారిలో కీలక నేతలు కుమాలి అలియాస్ అనితా మాండవి, గీతా అలియాస్ లక్ష్మి మడ్కం, రంజన్ అలియాస్ సోమా మాండవి, భీమా అలియాస్ జహాజ్ కల్ము ఉన్నారు. వారందరిపై రూ.8 లక్షల రివార్డు ఉందని తెలిపారు. ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం.. లొంగిపోయిన కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల తక్షణ సహాయంతో పాటు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ, వ్యవసాయ భూమి మొదలైన ఇతర సౌకర్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. గత 20 నెలల్లో దంతేవాడ జిల్లాలో 508 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు.

Maoists Surrender | హిడ్మా ఎన్​కౌంటర్​తో..

దేశంలో 2026 మార్చి 31 వరకు మావోయిస్ట్​లను లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ చేపట్టింది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. కీలక నేతలే లక్ష్యంగా ఆపరేషన్లు చేపడుతున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్​ విభాగాలు లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో మావోయిస్ట్​ పార్టీ (Maoist Party) బలహీనంగా మారింది. ఈ ఏడాది మే నెలలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్​ అలియాస్​ నంబాల కేశవరావు ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలు హతం అయ్యారు. దీంతో పార్టీలో చీలిక వచ్చి లొంగుబాట్లు పెరిగాయి.

పార్టీ పొలిట్​ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal)​, ఆశన్న తమ అనుచరులతో లొంగిపోయారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి జిల్లా మారేడ్​మిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్లలో మావోయిస్ట్ కీలక నేత, మోస్ట్​ వాంటెడ్​ మాడ్వి హిడ్మా (Madvi Hidma), ఆయన భార్య రాజే, టెక్​ శంకర్​ తదితరులు చనిపోయారు. హిడ్మా మృతి అనంతరం లొంగుబాట్లు పెరిగాయి. ఇప్పటికే మహారాష్ట్ర–మధ్యప్రదేశ్​–ఛత్తీస్​గఢ్​ జోనల్​ కమిటీ జనవరి 1న అందరం లొంగిపోతామని లేఖ విడుదల చేసింది. దీంతో త్వరలోనే దేశంలో మావోయిస్ట్ పార్టీ కనుమరుగు కానుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...