MLA Dhanpal | పాలకపక్షం ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారు: బీజేపీ నాయకులు

అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనే భయంతోనే పాలకపక్షం ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ దిలీప్ కుమార్​ (Commissioner Dileep Kumar)తో మంగళవారం భేటీ అయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, పొరపాట్లపై చర్చించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో గల ఒక […]

అక్షరటుడే, ఇందూరు : MLA Dhanpal | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election) బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనే భయంతోనే పాలకపక్షం ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ దిలీప్ కుమార్​ (Commissioner Dileep Kumar)తో మంగళవారం భేటీ అయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, పొరపాట్లపై చర్చించి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో గల ఒక వార్డులోని ఓటర్లను కావాలనే మరో వార్డులోకి మార్చారని.. అర్హులైన వేలాదిమంది ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఆరోపించారు. స్థానిక అధికార ప్రతినిధి కనుసైగల్లోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ముసాయిదాను తయారు చేయించాలని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండడంతో ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరిపి తప్పులను సరిదిద్దాలని తెలిపారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...