అక్షరటుడే, ఇందూరు : Municipal Reservations | కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా (Municipal Elections) నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఉత్కంఠ వీడింది. మేయర్ పీఠాన్ని మహిళ జనరల్‌కు కేటాయిస్తూ శనివారం ఎన్నికల కమిషన్ (Election Commission) ఉత్తర్వులు జారీ చేసింది.
Municipal Reservations | రెండు పర్యాయాలు బీసీ జనరల్ మహిళకే..
గత రెండు పర్యాయాలు బీసీ జనరల్ మహిళకే మేయర్ పీఠం రిజర్వ్ అయింది. దీంతో గతంలో ఒక పర్యాయం ఆకుల సుజాత, మరోసారి దండు నీతూకిరణ్ మేయర్ పదవిని కైవసం చేసుకున్నారు. ఈ సారి మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిజామాబాద్ మేయర్ పీఠంపై గురి పెట్టింది. అలాగే అర్బన్‌లో బీజేపీ తన ప్రాతినిథ్యాన్ని బలంగా చాటేందుకు పావులు కదుపుతోంది. అలాగే బీఆర్ఎస్, ఎంఐఎంలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Municipal Reservations | కామారెడ్డికి బీసీ మహిళ..
కామారెడ్డి మున్సిపాలిటీ ఛైర్మన్ (Kamareddy Municipality Chairman) పీఠంపై బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. అలాగే ఆర్మూర్ మున్సిపాలిటీకి జనరల్ మహిళ, భీమ్‌గల్ మున్సిపాలిటీకి జనరల్ మహిళ, బోధన్ మున్సిపాలిటీకి జనరల్‌కు కేటాయించారు. బిచ్కుంద బల్దియా జనరల్‌కు కేటాయించారు. బాన్సువాడ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. అలాగే ఎల్లారెడ్డి మున్సిపాలిటీని జనరల్‌కు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.