అక్షరటుడే, బోధన్ : Clinic Seized | పట్టణంలో అనుమతులు లేకుండా ఓ ఆర్ఎంపీ (MRP) నిర్వహిస్తున్న క్లినిక్‌ను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. బోధన్ పట్టణంలో కుమ్మన్‌పల్లి గ్రామానికి (Kummanapalli Village) చెందిన ఓ వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తూ వైద్యం చేస్తున్నాడు.
Clinic Seized | అర్హతలు లేకున్నప్పటికీ..
ఎటువంటి అర్హత లేకపోయినా అతడు వైద్యం చేస్తున్నాడని పలువురు ఫిర్యాదులు చేయడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమంత కలిసి పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించారు. అనంతరం క్లినిక్‌ను సీజ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో (First Aid Clinic) చికిత్సలు పొంది ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణతో (SHO Venkat Narayana) పాటు డాక్టర్ శేఖర్, రవి, నిర్మల పాల్గొన్నారు.