అక్షరటుడే, గాంధారి : Gandhari Mandal | తమ కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సదరు యువతి తన ప్రేమికుడితో కలిసి ఠాణాకు చేరుకుంటుండగా.. వారిపై ఆమె తల్లిదండ్రులు దాడికి యత్నించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy District) గాంధారి మండలంలో చోటుచేసుకుంది.
Gandhari Mandal | మొదట మిస్సింగ్ కేసు..
గాంధారి ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపిన వివరాల ప్రకారం.. మరలకుంట తండాకు చెందిన రాజేందర్ తన కూతురు కనిపించడం లేదంటూ వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కేసు విషయం తెలుసుకున్న సదరు అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు (Police Station) చేరుకుంటుండగా.. అక్కడి చేరుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు వారిపై దాడికి యత్నించారు. జంట ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేశారు.