అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shadowfax Technologies IPO | షాడోఫాక్స్ టెక్నాలజీస్ (Shadowfax Technologies ) అనేది భారతదేశంలో డిజిటల్ వాణిజ్యాన్ని సులభతరం చేయడంపై దృష్టి సారించిన టెక్నాలజీ నేతృత్వంలోని థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీ. దీనిని 2015లో స్థాపించారు. ఇది 14,758 పిన్ కోడ్‌లను కవర్ చేసే సర్వీస్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
ఎక్స్‌ప్రెస్ ఫార్వర్డ్ పార్శిల్ డెలివరీలు, రివర్స్ పికప్‌లు, ఎక్స్ఛేంజ్ డెలివరీలు, ప్రైమ్ డెలివరీలు, క్విక్ కామర్స్ మరియు హైపర్ లోకల్ డెలివరీలు, మొబిలిటీ సేవలు మరియు క్రిటికల్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈ కంపెనీ రూ. 1,907.27 కోట్లు సమీకరించడం కోసం ఐపీవో (IPO)కు వస్తోంది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 10 ముఖ విలువ కలిగిన 8.06 కోట్ల షేర్లను విక్రయించడ ద్వారా రూ. 1000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 7.32 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 907.27 కోట్లు సమీకరించనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, బ్రాండింగ్, మార్కెటింగ్ అవసరాల కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఆర్థిక పరిస్థితి..
2023 -24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 1,896.48 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా రూ. 11.88 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 2,514.66 కోట్లకు పెరగ్గా.. రూ. 6.06 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో కంపెనీ ఆస్తులు రూ. 786.14 కోట్లనుంచి రూ. 1,259.26 కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 1,819.80 కోట్లుగా, లాభం రూ. 21.04 కోట్లుగా, ఆస్తులు రూ. 1,453.16 కోట్లుగా ఉన్నాయి.
ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణిని రూ. 118 నుంచి రూ. 124 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 120 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద రూ. 14,880తో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 75 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాను కేటాయించారు. కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 7 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో ఐదు శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ముఖ్యమైన తేదీలు..
సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీ : జనవరి 20.
ముగింపు తేదీ : జనవరి 22.
అలాట్‌మెంట్ : జనవరి 23.
లిస్టింగ్ : జనవరి 28 న బీఎస్ఈ, ఎనఎస్ఈలలో షేర్లు లిస్ట్ అవుతాయి.