అక్షరటుడే, వెబ్డెస్క్ : BCCL IPO Listing | కోల్ ఇండియా (Coal India) అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (Bharat Coking Coal Ltd.) ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన తొలి మెయిన్ బోర్డ్ కంపెనీ. దేశంలోనే అతిపెద్ద కోకింగ్ బొగ్గు ఉత్పత్తిదారు అయిన బీసీసీఎల్.. పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 1,071 కోట్లు సమీకరించింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ అయిన ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 143.85 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ పోర్షన్ 310.81 రెట్లు, రిటైల్ పోర్షన్ 49.37 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. ఈ కంపెనీ షేర్లు సోమవారం బీఎసఈ, ఎనఎసఈలలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో షేరు ధరను గరిష్ట ప్రైస్‌బ్యాండ్ వద్ద రూ. 23 కాగా.. 45 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో (IPO) అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 95.65 శాతం లాభం వచ్చిందన్న మాట. లిస్టింగ్ తర్వాత రూ. 45.09 వద్ద గరిష్టాన్ని తాకిన షేరు ధర ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో కాస్త తగ్గింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో 86 శాతం లాభంతో 42.78 వద్ద కొనసాగుతోంది.