HomeసినిమాKamakshi Bhaskarla | పొలిమేర హీరోయిన్‌లో దాగి ఉన్న మ‌ల్టీ టాలెంట్‌.. రైట‌ర్‌, సింగ‌ర్‌గాను..

Kamakshi Bhaskarla | పొలిమేర హీరోయిన్‌లో దాగి ఉన్న మ‌ల్టీ టాలెంట్‌.. రైట‌ర్‌, సింగ‌ర్‌గాను..

‘పోలిమేర’ సిరీస్‌తో బలమైన గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి, ఇప్పుడు ‘12A రైల్వే కాలనీ’ తో మరింత క్రేజ్ అందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈమె మ‌ల్టీ టాలెంట్ గురించి తెలుసుకొని అంద‌రు అవాక్క‌వుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kamakshi Bhaskarla | తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu Film Industry)కి ప్రతీ ఏడాది ఎన్నో కొత్త ముఖాలు ప‌రిచ‌యం అయిన‌, ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకునే వారు చాలా అరుదు. అటువంటి అరుదైన ప్రతిభావంతుల జాబితాలో తాజాగా చేరిన పేరు కామాక్షి భాస్కర్ల.

డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, ఫ్యాషన్ రంగంలో మెరిసి, ఆ తర్వాత నటనలో తనదైన ముద్ర వేసుకున్న కామాక్షి ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టరుగా పనిచేసిన ఆమెకు మోడలింగ్ ప్రపంచం కొత్త అవకాశాలు తెచ్చిపెట్టింది.

Kamakshi Bhaskarla | రానున్న రోజుల‌లో మ‌రిన్ని అవ‌కాశాలు..

2018లో మిస్ తెలంగాణ (Miss Telangana) టైటిల్ గెలుచుకోవడంతో పాటు, మిస్ ఇండియా ఫైనల్ రౌండ్‌ వరకు చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. 2021లో విడుదలైన ‘ప్రియురాలు’ ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆమెకు, అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోలిమేర’ సిరీస్ గేమ్ చేంజర్‌గా మారింది. డీ-గ్లామర్ రోల్‌లో నేచురల్ నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించింది. ఇప్పుడు కామాక్షి మరో కీలక చిత్రంతో థియేటర్లలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. అల్లరి నరేష్ హీరోగా, కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) హీరోయిన్‌గా నటించిన ‘12A రైల్వే కాలనీ’ ఈ నెల 21న విడుదల కానుంది. నాని కాసరగడ్డ దర్శకత్వం (Director Nani Kasaragadda) వహిస్తున్న ఈ చిత్రానికి కథను అందించడమే కాకుండా దర్శక పరివేక్షణ కూడా చేసిన అనిల్ విశ్వనాథ్, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కామాక్షి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కామాక్షి కేవలం నటనే కాదు, మల్టీ-టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి అదనపు డైలాగులు కూడా ఆమె రాసిందని, తన పాత్రకు తగ్గట్లుగా సూచించిన సన్నివేశాలు ఫైనల్ స్క్రిప్ట్‌లో చేరాయని తెలిపారు. అంతేకాక, కామాక్షి మంచి సింగర్‌ కూడా అని వెల్లడించారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఆమె హమ్మింగ్ వినగానే, భవిష్యత్తులో ఆమెతో పాటలు పాడించే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. మోడలింగ్, యాక్టింగ్, రైటింగ్, సింగింగ్, మెడికల్ ఫీల్డ్.. ఇలా ఏ రంగం చూసినా కామాక్షి తన ప్రతిభతో ప్రత్యేక స్థానం సంపాదిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.