అక్షరటుడే, బాన్సువాడ: Kalvakuntla kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని చెప్పి మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జనం బాటలో భాగంగా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం (Koyyagutta Martyrs’ Stupa) వద్ద ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
అనంతరం కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (Social Welfare Girls Gurukul School) సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించారు. ఉద్యమకారులకు పింఛన్, గుర్తింపు కార్డులు ఇచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ కాస్మొటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చందూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి మృతిపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు.
